హైదరాబాద్, ఆట ప్రతినిధి: గురుకుల విద్యార్థులు చదువుల్లోనే కాదు.. క్రీడల్లోనూ సత్తాచాటుతున్నారు. లక్నో వేదికగా జరిగిన ట్రయల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన రాష్ర్టానికి చెందిన యువ రెజ్లర్లు సలోమి, అక్షయ.. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్‌సీవోఈ)కి ఎంపికయ్యారు. మొత్తం 74 మంది రెజ్లర్లు పోటీపడ్డ ట్రయల్స్‌లో 24 మందితో ఎంపిక చేసిన తుది జాబితాలో వీరిద్దరు చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లుగా ఎదిగేందుకు సలోమి, అక్షయకు ఎన్‌సీవోఈ సరైన వేదికగా ఉపయోగపడనుంది.