Guns & Gulaabs | స్త్రీ (Stree), మోనికా ఓ మై డార్లింగ్ (Monica Oh My Darling), భీడ్(Bheed), న్యూటన్ (Newton) లాంటి మూవీలతో హిట్ కొట్టి బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రాజ్ కుమార్ రావు (Raj Kumar Rao). ఆయన మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న సరికొత్త వెబ్‌సిరీస్ ‘గన్స్ అండ్ గులాబ్స్’ (Guns & Gulaabs).
ఇప్పటికే ఈ వెబ్‌సిరీస్ నుంచి ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్లు విడుదల కాగా అవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక క్రైమ్, కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఆగస్టు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ షూరు చేశారు. వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ గన్స్ అండ్ గులాబ్స్పై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించి రాజ్ కుమార్ రావు క్యారెక్టర్ యొక్క వీడియోను వదిలారు. “గుండెలు అదిరిపోయే యాక్షన్, గుండెలు నిండిపోయే రొమాన్స్ ఇంకా అదిరిపోయే కామెడీ పానదారి టిప్పు అన్ని చేయగలడు” అంటూ సోషల్ మీడియాలో నెట్‌ఫ్లిక్స్ రాసుకోచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
Dil dehlaane wala action, dil behlaane wala romance aur dher saari comedy…Paanadhari Tipu can do it all 🔫 🌹#GunsAndGulaabs arrives August 18th only on Netflix! pic.twitter.com/D2L1ryni9D
— Netflix India (@NetflixIndia) August 6, 2023
‘ద ఫ్యామిలీమ్యాన్’ (The Family Man), ‘ఫర్జీ’ (Farzi) లాంటి వెబ్ సిరీస్‌లతో సూపర్ హిట్స్ అందుకున్న దర్శకులు రాజ్ అండ్ డీకే (Raj & Dk) ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆదర్శ్ గౌరవ్, గుల్షన్ దేవయ్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.