Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
వర్షాభావంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర నాయకుడు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య విమర్శించారు.
ఊట్కూర్, అక్టోబర్ 25 : వర్షాభావంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర నాయకుడు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య విమర్శించారు. కరువు పరిస్థితులు ముందుగానే స్పష్టమైనప్పటికీ ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడం పాలనా వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బిజ్వార్లోని శ్రామిక భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వర్షాభావంతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని, పశుగ్రాసం, తాగునీటి కొరతతో ప్రజలు, పశువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కరువు తీవ్రతను అంచనా వేసి ముందస్తు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వాలు ప్రకటనలకే పరిమితమ వుతున్నాయని విమర్శించారు. తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
హామీల అమలులో జాప్యమెందుకు?
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నరసయ్య డిమాండ్ చేశారు. ఆసరా పింఛన్ల పెంపు, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, సంపూర్ణ రైతు రుణమాఫీ హామీల అమలులో జాప్యం జరుగుతోందని విమర్శించారు. రుణభారంతో సతమతమవుతున్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం డిసెంబర్ 29, 2026న హైదరాబాద్‌లో వేలాది మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఎస్ఐఆర్పై అభ్యంతరం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని నర్సయ్య ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగిస్తున్నారన్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ను రద్దు చేయడంతోపాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని కోరారు.
సమావేశంలో ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రాము, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ఎం.కృష్ణ, ఎం.హన్మేష్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు అమలు చేయకపోతే ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ డివిజన్ కార్యదర్శి సలీమ్, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఎస్.కిరణ్, మండల కార్యదర్శి సిద్ధు, ఉపసర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, నాయకులు మల్లేష్, జి.కృష్ణయ్య, పోర్ల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Road accident | కొల్లూర్ ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Kerala woman | తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు.. 13 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీ, పిల్లలు
DDLJ Movie | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. థియేటర్లలోకి ‘డిడిఎల్జె’ రీ-రిలీజ్!
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

