Kerala woman | తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు.. 13 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీ, పిల్లలు
Kerala woman : తల్లి తనను వేధిస్తుందని ఒక కొడుకు 13ఏళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ తర్వాత అనేక పరిణామాల మధ్య తల్లి, పిల్లలు వేరయ్యారు. చివరకు 13 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు.
Kerala woman : తల్లి తనను వేధిస్తుందని ఒక కొడుకు 13ఏళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ తర్వాత అనేక పరిణామాల మధ్య తల్లి, పిల్లలు వేరయ్యారు. చివరకు 13 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. ఈ ఘటన కేరళలో జరిగింది. కొన్నేళ్లక్రితం కేరళకు చెందిన ఒక మహిళ కాసర్గాడ్ జిల్లా, చీమెనికి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారికి 2013 నాటికి వారికి 12 ఏళ్ల కొడుకు, ఒక కూతురు ఉంది. అయితే, అప్పటికే వారి కుటుంబంలో విబేధాలు చోటు చేసుకున్నాయి.
ఈ క్రమంలో ఆమె కొడుకు తల్లిపై చిత్తరిక్కల్ పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన తల్లి తనపై దాడి చేసి, వేధిస్తోందని ఫిర్యాదు చేశాడు. ఈ సమయంలో ఆమెను పోలీసులు అరెస్టు చేశార. జుడీషియల్ కస్టడీలో ఉంచారు. ఆ తర్వాత కొద్ది రోజులకే.. అంటే, 2013లోనే ఆమెకు బెయిల్ లభించింది. కానీ, అప్పటికే తీవ్ర వేదనతో ఉన్న ఆమె బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వివిధ రాష్ట్రాలకు, గుర్తు తెలియన ప్రదేశాలకు వెళ్లిపోయింది.
మరోవైపు ఆమె కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆమె భర్త మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లల్లో కొడుకు తండ్రితోనే ఉంటున్నాడు. కూతురు మాత్రం అమ్మమ్మ వాళ్లింట్లో ఉంటోంది. ఆమె ఎక్కడుందో తెలియదు.. భర్త మరో పెళ్లి చేసుకున్నాడు.. తనపై ఫిర్యాదు చేసిన కొడుకు తండ్రితో.. కూతురు అమ్మమ్మ వాళ్లింట్లో జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే, ఆమె కోసం ఎప్పటినుంచో వెతుకుతున్న పోలీసులకు తాను తిరువల్ల ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.
ఆమె వృద్ధుల సంరక్షకురాలిగా ఒక ఆశ్రమంలో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను అక్టోబర్ 21న అరెస్టు చేశారు. అయితే, ఈ విషయం తెలిసిన ఆమె కొడుకు తన ఫిర్యాదును వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపాడు. తన తల్లి జైలుకు వెళ్లడం ఇష్టం లేదని కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు కొడుకు వయసు 25. తన తల్లిపై ఫిర్యాదు చేసినప్పుడు అతడి వయసు 13. ఇంతకాలం తర్వాత ఆ తల్లి తన కొడుకుతోపాటు కూతురును కూడా కలుసుకుంది.
బెయిల్‌పై విడుదలైన అనంతరం ఆ మహిళ రెండు రోజులు కొడుకు, కూతురుతో గడిపింది. అనంతరం వృద్ధుల సంక్షేమం కోసం తిరువల్ల వెళ్లిపోయింది. ఇక, ఇప్పుడు ఆమె పిల్లలు ఇద్దరికీ పెళ్లిల్లు అయిపోయాయి. తమ తల్లి తమతోనే ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఈ కేసు ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kerala woman | తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు.. 13 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీ, పిల్లలు
DDLJ Movie | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. థియేటర్లలోకి ‘డిడిఎల్జె’ రీ-రిలీజ్!
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకున్న మహిళ.. ప్రాణాలను కాపాడుకోవడంలో కీలకం..
Man Prints Fake Rs 500 Notes | ఇంటి అద్దె చెల్లించలేక.. నకిలీ రూ.500 నోట్లు ముద్రించిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

