
హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తేతెలంగాణ): పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందిస్తూ గ్రీన్‌మ్యాన్ నర్పత్సింగ్ రాజ్‌పురోహిత్ చేపట్టిన ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన సైకిల్ యాత్ర హైదరాబాద్‌కు చేరుకొన్నది. సైకిల్‌పై పర్యటిస్తూ పర్యావరణ పరిరక్షణపై ప్రచారం చేస్తున్న ఈయన.. గురువారం తెలంగాణ అటవీశాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ (సోషల్ ఫారెస్ట్) ఆర్ఎం డోబ్రియాల్, అదనపు పీసీసీఎఫ్ (డెవలప్మెంట్) ఎంసీ పైర్గెన్ హరితహారం గురించి నర్పత్సింగ్కు వివరించారు. అడవులు, వన్యప్రాణుల పరిక్షణలో నర్పత్సింగ్ కృషిని ప్రశంసించిన అధికారులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఇప్పటి వరకు 15 రాష్ర్టాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించిన ఈయన 25,097 కిలోమీటర్లు సైకిల్‌పై తిరిగారు. యాత్ర మార్గంలో వన్యప్రాణులను సంరక్షించటం, వన్యప్రాణుల కోసం రక్తదానం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అవగాహన యాత్రలో భాగంగా శుక్రవారం నుంచి సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం జిల్లాల మీదుగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్ చేరుకోనున్నట్టు నర్పత్సింగ్ పేర్కొన్నారు.
నర్పత్ సింగ్ సైకిల్ యాత్ర విశేషాలు
స్వరాష్ట్రం రాజస్థాన్
లక్ష్యం పర్యావరణ
పరిరక్షణపై ప్రచారం
యాత్ర ప్రారంభం
27 జనవరి 2019 (కశ్మీర్లో)
కిలోమీటర్ల లక్ష్యం
31 వేలు
నాటిన చెట్లు
90 వేలు
సోదరికి కట్నం
251 మొక్కలు
మేనకోడలికి కట్నం
151 మొక్కలు