సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనడం ప్రభావంతో రాగల 36 గంటల్లో గ్రేటర్లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా నగరంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.8డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.08డిగ్రీలు, గాలిలో తేమ 70శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.