ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. ఆనంది టైటిల్ రోల్‌ని పోషిస్తున్నది. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు.
బుర్ర కథలను ఓ ఉద్యమంగా మార్చి గ్రామీణ ఆత్మగౌరవానికి ప్రతీకలా నిలిచిన గరివిడి లక్ష్మి జీవితానికి సెల్యూట్ లాంటి సినిమా ఇదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం నుంచి ‘కొండ కోన’ అనే పాటను విడుదల చేశారు. అక్టోబర్ 17న ఈ సినిమా విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: చరణ్‌అర్జున్, నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్, దర్శకత్వం: గౌరీ నాయుడు జమ్ము.