దోమ, మే 26: మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామ పంచాయతీ దాని అనుబంధ గ్రామమైన అనంతరెడ్డిపల్లిలో టీజీఐఐసీ ఇండస్ట్రి యల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఫాం-సి కింద వికారాబాద్ ఆర్డీవో వాసు చంద్ర ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ సభ ఏర్పాటు చేశారు. రెండు గ్రామాల్లో కలిపి లావణి పట్టాలోని 5 సర్వే నంబర్లలో 96 ఎకరాలు, పట్టా భూములలోని 47 సర్వే నంబర్లలోని 209 ఎక రాలు మొత్తం కలిపి 305 ఎకరాల భూమి ని టీజీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్‌కు అప్పగించేందుకు అధికారులు రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా ఆర్డీవో మాట్లా డుతూ పబ్లిక్ పర్పస్ కోసం నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ తీసుకు వస్తామని, యువతకు ఉద్యోగాలు దొరుకుతాయని తెలుపుతూ సోషియో ఎకనమిక్ సర్వే తరువాత రైతుల భూములలో ఇండస్ట్రియల్ పార్కుకు ఎంత భూమి పోతుంది ఎంత మిగులుతుందో తెలుస్తుందని దాన్ని బట్టి పూర్తి నిర్వాసితులకు అదనంగా ప్యాకేజీ ఇచ్చే అవకాశం ఉందన్నారు. రైతుల నుంచి సేకరించిన అభిప్రా యాలను ఉన్నతాధికారులకు పంపిన తరువాత స్పష్టమైన హామీ ఇస్తామన్నారు. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటులో భూములు కోల్పో తున్న రైతులు ప్రభుత్వానికి సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని వికారాబాద్ ఆర్డీవో వాసుచంద్ర అన్నారు.అనంతరం పలువురు రైతులు మాట్లా డుతూ భూములు కోల్పోతున్న వారికి భూములకు భూములు ఇస్తా రా? నష్ట పరిహారం ఇస్తే ఎంత ఇస్తారు? పొల్యూషన్ లేని కంపెనీలు అంటున్నారు అవి ఏవి పెడతారో తెలపాలని అధికారులను రైతులు నిలదీశారు.
తాతల తరాల నుంచి భూములను నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు భూములు కోల్పోతే మా బతుకులు ఎలా గడుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రెరా కిందకు వచ్చే భూములలో పచ్చదనం ఉండాలని అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పిన మాట నిజం కాదా? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్గానిక్ వ్యవసాయం చేయమంటుంటే మీరు ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తామనడం సరికాదన్నారు. రైతులు ఇచ్చిన అభిప్రాయాలను సేక రించిన అనంతరం అధికారులు వెళ్లి పోయారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోవిందమ్మ, టీజీఐఐసీ జనరల్ మేనేజర్ శేషగిరి, సర్పంచ్ విజయలక్ష్మి,వార్డు సభ్యు లు,ఆయా శాఖల అధికారులు, వివిద మండలాల ఎస్సైలు, రైతులు పాల్గొన్నారు.

నా కొడుకుకు పిల్లనివ్వడం లేదు..
నేను కష్టపడి కూలి నాలీ చేసి రెండె ఎక రాల భూమి కొని నా కొడుకు పేరుమీద పట్టా చేశాను. నాకు చదువు రాదు. నా కొడుకుకు చదువు రాదు. మేం వ్యవసాయం చేసుకొనే బతుకుతు న్నాం. ఇప్పుడు నా కొడుకుకు పెళ్లి చేద్దా మంటే ఇండస్ట్రియల్ పార్కులో భూమి పోతుందని ఎవ్వరు పిల్లను ఇవ్వడం లేదు. నా కొడు కుకు చదువైనా ఉంటే మీరు పెట్టే కంపెనీలో ఉద్యోం ఇచ్చేవారేమో? కాని ఆ పరిస్థితి లేదు మరి. మే మెలా బతకాలో మీరే దారి చూపాలి.
– రైతు తిమ్మయ్య, దిర్సంపల్లి
ఆడ బిడ్డల పెండ్లిళ్లు ఎలా చేయాలి..
రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఇద్దరు ఆడ పిల్లలు. వారి పెం డ్లిళ్ల కోసమే భూమి అమ్మకుండా హైదరా బాద్ వెళ్లి పది సం వ త్సరాల నుంచి కూలీ పనులు చేసు కుంటూ భూమిని కాపాడు కున్నాం. భూమి అమ్మి ఇద్దరి కూతుర్ల పెండ్లిళ్లు చేద్దామని గత ఏడాది స్వగ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ కాలం గడుపుతున్నాం. ఇండ స్ట్రియల్ పార్క్, రేడి యల్ రోడ్డు పేరుతో మా భూములను లాక్కుంటే ఎట్లా?
-మహిపాల్‌రెడ్డి, నిర్మల దంపతులు