GMR | న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జీక్యూజీ పార్టనర్స్..జీఎమ్మార్ ఎయిర్పోర్ట్లో తన వాటాను 5.17 శాతానికి పెంచుకున్నది. రూ.433 కోట్లతో 0.43 శాతం వాటాను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసింది. దీంతో ప్రస్తుతం 4.74 శాతంగా ఉన్న వాటా 5.17 శాతానికి చేరుకున్నది. ఈ నెల 23న ముగిసిన కంపెనీ షేరు ధర రూ.95.85 ఆధారంగా రూ.433 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం కంపెనీ ఢిల్లీ, హైదరాబాద్, గోవాలో విమానాశ్రయాలను నిర్వహిస్తున్నది.
అపోలోతో అవెస్తజెన్ దోస్తీ
చెన్నై, ఆగస్టు 28: లైఫ్ సైన్సెస్ కంపెనీ అవెస్తజెన్ లిమిటెడ్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్లో భాగమైన అపోలో ఆయుర్వేద్ కలిసి ఓ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశాయి. ఇందులోభాగంగా మెడికల్ ఫుడ్, ఇతర ఆహార పదార్థాలను తయారు చేయనున్నాయి. అవెస్తఆయుర్వేద్ అనే ఉమ్మడి బ్రాండ్ కింద వీటిని మార్కెట్లో విక్రయించనున్నారు. తమ ఈ భాగస్వామ్యం మెడికల్ ఫుడ్, డైటరీ సప్లిమెంట్స్ మార్కెట్లో గొప్ప ముందడుగు కాగలదని అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ప్రీతా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.