KBR : కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు వస్తున్నాయంటూ హడావిడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడించింది. ప్రచారం కోసం పర్యావరణాన్ని హరిస్తూ కోట్లకొద్ది ప్రజాధనంతో ఫ్లెక్సీలు, పోస్టర్లు వేయించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అవన్నీ రద్దు చేసింది. కేబీఆర్ చుట్టూ రూ.1,090 కోట్లతో ప్రారంభించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం రద్దు నిర్ణయంతో పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. ఫ్లైఓవర్ల నిర్మాణం రద్దుతో పిల్లర్లు నిర్మించేందుకు వేసిన ఐరన్ రాడ్స్ తొలగిస్తూ గుంతలు పూడ్చే పనులు మొదలుపెట్టింది ప్రభుత్వం.
రేవంత్ రెడ్డి అసమర్ధ పాలన, నిర్ణయాల మూలంగా.. కేబీఆర్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం కోసం వెచ్చించిన కోట్లాది రూపాయలు వృథా అయ్యాయి. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ అంచనాలు సరిగ్గా వేయకకుండా రూ.1,090 కోట్లతో పనులు మొదలెట్టి.. హడావిడి చేసిన సర్కార్ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. తమది తప్పుడు నిర్ణయమని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మాణం రద్దుతో రూ.400 కోట్లు ప్రభుత్వానికే ఆదా అవుతుందంటూ తమ అనుకూల మీడియాలో ప్రచారం చేస్తోంది.
అంతేకాదు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని భావిస్తోంది. గతంలో ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల స్థానంలో ఎలివేటెడ్ కారిడార్‌కు ప్రణాళికలు వేస్తోంది సర్కార్. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు 4 కిలోమీటర్ల పొడవు, 6 లేన్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సన్నద్ధమవుతోంది. దాంతో.. మరి కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు వస్తున్నాయంటూ పచ్చని చెట్లు ఎందుకు కొట్టేశారు? రూ.కోట్ల ఖర్చుతో ఫ్లెక్సీలు ఎందుకు ఏర్పాటు చేశారు? అని పర్యావరణ వేత్తలు కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తున్నారు.
తుగ్లక్‌ను తలపిస్తున్న రేవంత్
కేబీఆర్ చుట్టూ రూ.1,090 కోట్లతో ప్రారంభించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలు రద్దు
క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ అంచనాలు సరిగ్గా వేయకపోవడంతో రూ. వేల కోట్ల ప్రజాధనం వృథా
ఇలా చేస్తే రూ.400 కోట్లు ప్రభుత్వానికే ఆదా అవుతుందంటూ అనుకూల మీడియాలో ప్రచారం
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు వస్తున్నాయంటూ రూ.కోట్ల ఖర్చుతో ఫ్లెక్సీలు
రేవంత్ తుగ్లక్ నిర్ణయంతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు పోయి.. రోడ్లపై మిగిలిపోయిన ఫ్లెక్సీలు
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం
గతంలో ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల స్థానంలో ఎలివేటెడ్ కారిడార్‌కు ప్రణాళికలు
పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు 4 కిలోమీటర్ల పొడవు, 6 లేన్లతో ఎలివేటెడ్ కారిడార్
ప్రాజెక్టు ఆగిపోవడంతో ఐరన్ రాడ్లను తొలగిస్తూ, గుంతలను పూడ్చే పని మొదలుపెట్టిన ప్రభుత్వం
ఫ్లైఓవర్ల కోసం వేలకొద్దీ చెట్లను నరికేసిన ప్రభుత్వం.. పచ్చదనం లేక బోసిపోయిన కేబీఆర్ రోడ్
నరికిన చెట్లను తిరిగి తీసుకురాగలరా? అని ప్రభుత్వంపై మండిపడుతున్న పర్యావరణవేత్తలు
— Telugu Scribe (@TeluguScribe) October 5, 2026