సికింద్రాబాద్, డిసెంబర్ 22 : డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బుధవారం రసూల్‌పురాలో ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘డ్రగ్స్‌కు నో చెప్పండి’ అనే నినాదంతో నిర్వహించిన ‘ది ఇన్ఫినిటీ రైడ్ 2021’ను సినీనటి మంచులక్ష్మి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఎస్కే జోషి, ఐపీఎస్ జితేంద్రగోయల్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ డ్రగ్స్‌పై అవగాహన కల్పించేందుకు ఆదిత్య ఫౌండేషన్ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు దాదాపు 650 కిలో మీటర్ల సైకిల్ రైడ్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో ఐపీఎస్ అధికారి ముతాజైన్, ఆదిత్య ఫౌండేషన్ నిర్వాహకుడు ఆదిత్య మెహత తదితరులు పాల్గొన్నారు. ఈ రైడ్‌లో తెలంగాణ పోలీస్, నార్కోటిక్స్, కంట్రోల్ బ్యూరో, కర్ణాటకకు చెందిన పోలీసులు, సైకిలిస్ట్‌లు ఉన్నారు.
పర్యావరణ పరిరక్షణలో తన వంతు భూమిక పోషించిన ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వర్ రావును రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రత్యేకంగా రాజ్‌భవన్‌కు పిలిపించి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అలాగే జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలో రామేశ్వర్‌రావును ఘనంగా సత్కరించారు
కుత్బుల్లాపూర్, డిసెంబర్ 22 : హెచ్ఎంటీ మెషిన్ టూల్స్‌లో పనిచేస్తున్న కా