e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News గంట‌కు పైగా కొన‌సాగిన గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం

గంట‌కు పైగా కొన‌సాగిన గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యాయి. బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌సంగించారు. ‌ప్ర‌భుత్వ సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల‌తో పాటు రాష్ర్ట ప్ర‌భుత్వం సాధించిన ప్ర‌గ‌తిని గ‌వ‌ర్న‌ర్ వివ‌రించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం గంట‌న్న‌ర‌కు పైగా కొన‌సాగింది. ఉద‌యం 11 :05 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ప్ర‌సంగం.. 12:15 గంట‌ల‌కు ముగిసింది. ప్ర‌సంగం ముగిసిన అనంత‌రం గ‌వ‌ర్న‌ర్‌తో పాటు స‌భ్యులంద‌రూ జాతీయ గీతాన్ని ఆల‌పించారు. అనంత‌రం స‌భ రేప‌టికి వాయిదా ప‌డింది.
ఉద‌యం శాస‌న‌స‌భ ప్రాంగ‌ణానికి చేరుకున్న గ‌వ‌ర్న‌ర్‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్, స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి స్వాగ‌తం ప‌లికారు. స‌భా మందిరంలోకి గ‌వ‌ర్న‌ర్ ఎర్ర తివాచీపై న‌డుచుకుంటూ వెళ్లారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement