బాఫ్టా బెస్ట్ యాక్టర్‌కు నామినేట్ అయిన గౌరవ్ ఆదర్శ్

లండన్: బ్రిటీష్ ఫిల్మ్ అకాడమీ ఇచ్చే బాఫ్టా అవార్డులకు .. ఉత్తమ నటుడి క్యాటగిరీలో గౌరవ్ ఆదర్శ్ నామినేట్ అయ్యాడు. ద వైట్ టైగర్ చిత్రంలో గౌరవ్ ఆదర్శ్ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్ రావులు ప్రధాన పాత్రలను పోషించారు. బెస్ట్ యాక్టర్ క్యాటగిరీలో నామినేట్ అయిన గౌరవ్ ఆదర్శ్‌పై ప్రియాంకా చోప్రా ప్రశంసలు కురిపించింది. ఈ సినిమాకు ఆమే ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్‌గా ఉన్నారు. ద వైట్ టైగర్ సినిమాకు మరో క్యాటగిరీలోనూ నామినేట్ అయ్యింది. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే క్యాటగిరీకి కూడా ఈ సినిమా ఎంపికైంది. అరవింద్ అడిగ రాసిన పుస్తకం ఆధారంగా రామిన్ బహరాని ఈ సినిమాను తీశారు. ఆదర్శ్ గౌరవ్ బెస్ట్ యాక్టర్ క్యాటగిరీకి నామినేట్ కావడం పట్ల ప్రియాంకా తన ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. భారతీయ నటులతో తీసిన సినిమా రెండు బాఫ్టా అవార్డులకు నామినేట్ కావడం గర్వకారణమని ప్రియాంకా తన ట్వీట్లో పేర్కొన్నారు. గౌరవ్ ఆదర్శ్ ఆ అవార్డుకు అర్హుడని ఆమె అన్నారు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయినందుకు గర్వంగా ఉందన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Raids | అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడులు .. నాలుగు టిప్పర్లు సీజ్
Sangam Banda canal | నెలలుగా సాగునీరు వృథా.. పట్టించుకోని ఇరిగేషన్ శాఖ
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

