కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేకమైన డూడుల్‌ను రూపొందించింది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని తెలుపుతూ గూగుల్ రూపొందించిన ప్రత్యేక డూడుల్ అందర్నీ ఆకట్టుకుంటుంది.
ఈ సందర్భంగా గూగుల్ డూడుల్ ట్వీట్ చేసింది. మాస్కులు ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి అని క్యాప్షన్ ఇచ్చింది. కరోనా మహమ్మారి నివారణకు మాస్కులు ధరించడం తప్పనిసరి అని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని, దాన్ని అదుపు చేసే బాధ్యత అందరిపై ఉందని పేర్కొంది. కరోనా నియంత్రణకు ఈ మూడింటిని తప్పనిసరిగా పాటించాలని కోరింది.
Masks are still important. Wear a mask and save lives.
— Google Doodles (@GoogleDoodles) April 6, 2021
As COVID-19 continues to impact communities around the world, help stop the spread by following these steps → https://t.co/yn3hm5iZ5Y#GoogleDoodle pic.twitter.com/rH7xyNLoDP