న్యూఢిల్లీ: స్లీప్ ఆప్నియా (నిద్రలో శ్వాసకు భంగం కలగడం)తో బాధపడేవారికి శుభవార్త. త్వరలోనే ఈ స్లీప్ డిజార్డర్‌కు మందు గోళీ అందుబాటులోకి రానున్నది. కేంబ్రిడ్జ్కు చెందిన బయోటెక్ కంపెనీ అప్నిమెడ్ ఈ మాత్రను అభివృద్ధి చేసింది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ‘ఎఫ్‌డీఏ’ ఆమోదం కోసం సిద్ధమవుతున్నది. బహుశా ఇది 2027కల్లా మార్కెట్లో రోగులకు అందుబాటులోకి వస్తుందని తెలిసింది. ‘స్లీప్ అప్నియా’ అనేది నిద్రపోతున్నప్పుడు కొద్ది సేపు శ్వాసను ఆపివేసే సమస్య. ఇది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారవచ్చు.