ఓ గిరిజన యువతి షూటింగ్లో జాతీయస్థాయి క్రీడాకారిణిగా ఎదిగిన వైనం..లక్ష్యసాధనలో ఆమెకు ఎదురైన ప్రతిబంధకాలకు దృశ్యరూపాన్నిస్తూ రూపొందించిన చిత్రం ‘గుడ్‌లక్ సఖీ’. నగేష్ కుకునూర్ దర్శకుడు. ఈ నెల 26న ప్రేక్షకులముందు కురానుంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్‌చంద్ర పదిరి నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ‘మహిళాసాధికారతను చాటే చిత్రమిది. కీర్తి సురేష్ పాత్ర చిత్రణ స్ఫూర్తివంతంగా అనిపిస్తుంది. లక్ష్యశుద్ధి ఉంటే ఏరంగంలోనైనా మహిళలు విజేతలుగా నిలవొచ్చనే సందేశంతో ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం తెలిపింది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చిరంతాన్దాస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, దర్శకత్వం: నగేష్ కుకునూర్.