దుబాయ్ : ఇటీవలే మలేషియాలో ముగిసిన ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్లో టోర్నీ ఆసాంతం ఆల్రౌండ్ షోతో రాణించి భారత్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష.. ఐసీసీ మంత్లీ అవార్డుకు నామినేట్ అయింది. జనవరి నెలకు గాను ఐసీసీ ప్రకటించిన జాబితాలో త్రిష.. వెస్టిండీస్ బౌలర్ కరిష్మా, ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీతో పాటు పోటీలో నిలిచింది. పురుషుల విభాగంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నామినేట్ అయ్యాడు.