బంగారం కొనుగోలు సమయంలో, ఆ తర్వాత భద్రపర్చడంలోనూ అనేక వ్యయాలను భరించాల్సి ఉంటుంది. అలాంటివేవీ లేకుండా గోల్డ్ సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నది. ఏ బ్యాంకులోనైనా ఈ గోల్డ్ సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చని సమాచారం. అకౌంట్ ప్రారంభించిన తర్వాత ఎప్పుడైనా ఒక గ్రాము బంగారానికి సమాన మొత్తాన్ని కనీసంగా డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలుస్తున్నది. అలాగే ప్రభుత్వ పూచీకత్తు కలిగిన సావరిన్ గోల్డ్ బాండ్లనూ ఈ అకౌంట్లోనే కొనుగోలు చేసే వీలును కల్పించనున్నారు. విత్‌డ్రా చేయాలనుకున్నప్పుడు ఆ రోజు బంగారం విలువనుబట్టి నగదును ఇస్తారంటున్నారు. అన్ని అకౌంట్ల తరహాలోనే దీనికీ పాస్‌బుక్ ఉంటుంది. డిపాజిట్లను, విత్‌డ్రాయల్స్‌ను నోట్ చేసుకోవచ్చు.