Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఆల్‌టైం రికార్డు దాటాయి. చెన్నైలో సోమ, మంగళవారాల్లో రూ.63,050 పలికింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.57,800 వద్ద నిలిచింది.
దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం తులం బంగారం (24 క్యారట్స్) తులం ధర రూ.100 పెరిగి రూ.62,750 పలికిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. సోమవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.62,650 వద్ద నిలిచింది. మరోవైపు కిలో వెండి ధర యధాతథంగా రూ.78,200 వద్ద కొనసాగుతున్నది.
హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.57,350, 24 క్యారట్ల బంగారం తులం రూ.62,560 వద్ద నిలిచాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,500 పలికింది.
బెంగళూరు, ముంబై, కోల్‌కతా నగరాల్లో 24 క్యారట్స్ తులం బంగారం ధర రూ.62,560 వద్ద నిలిచింది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్స్ బంగారం తులం ధర రూ.57,350 వద్ద నిలిచింది. కిలో వెండి రూ.78వేల వద్ద నిలిచింది.
అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 2014 డాలర్లు పలికింది. ఔన్స్ వెండి ధర 24.60 డాలర్ల వద్దకు చేరుకున్నది. కామెక్స్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర నాలుగు డాలర్లు పెరిగి 2014 డాలర్ల వద్ద నిలిచింది. మరోవైపు, ఫ్యూచర్స్ మార్కెట్లో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.5 తగ్గి రూ.61,535 వద్ద నిలిచింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ బంగారం 2034.80 డాలర్లు పలికింది.