తగ్గిన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ: దేశంలో గత రెండు రోజులు ఎగిసిన బంగారం, వెండి ధరలు ఇవాళ తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.148 తగ్గి రూ.46,307కు దిగివచ్చింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,455 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధర తగ్గడం, అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి కాస్త బలపడటం ఇవాళ దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గడానికి కారణమైందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
వెండి ధరలు కూడా బుధవారం దిగివచ్చాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.886 తగ్గి రూ.68,676కు దిగివచ్చింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధర రూ.69,562 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,807 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 27.63 అమెరికన్ డాలర్లు పలికింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

