Hyderabad News | దేశవ్యాప్తంగా బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ప్రపంచ మార్కెట్ పరిణామాల నేపథ్యంలో నేడు కూడా ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
నేటి తాజా ధరలను పరిశీలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,45,400కు చేరుకోగా, నిన్నటితో పోలిస్తే ఇది సుమారు రూ. 1,350 మేర పెరిగింది. అదేవిధంగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ. 1,470 పెరుగుదలతో రూ. 1,58,620 వద్ద కొనసాగుతోంది. కేవలం బంగారం మాత్రమే కాకుండా, వెండి కూడా చారిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరుకొని బెంబేలెత్తిస్తోంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 3,60,100 వద్ద ట్రేడవుతోంది. ఒక్క రోజులోనే వెండిపై రూ. 100 పెరుగగా.. గత కొన్ని రోజులుగా ఈ ధరలు ఏకంగా లక్షల్లో పెరగడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.