హైదరాబాద్, జూలై 27: దేశంలో అతిపెద్ద ఈవీ చార్జింగ్ సదుపాయాల సంస్థల్లో ఒకటైన గ్లిడా..హైదరాబాద్‌లో అతిపెద్ద ఈవీ చార్జింగ్ హబ్‌ను ప్రారంభించింది. శంషాబాద్ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో ఏర్పాటు చేసిన ఈ హబ్‌లో ఒకేచోట 102 చార్జింగ్ పాయింట్లను నెలకొల్పింది. ఈ హబ్‌ను రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ శనివారం ప్రారంభించారు. ఒకేసారి 102 కార్లను రీచార్జి చేసుకోవచ్చును. ఈ హబ్‌లో 200 కిలోవాట్ల అల్ట్రాఫాస్ట్ చార్జింగ్ ఒక్కటి నెలకొల్పిన సంస్థ.. 60 కిలోవాట్ల డ్యూయల్ గన్ డీసీ చార్జర్ 28 ఉండగా, 30 కిలోవాట్ల డీసీ చార్జర్లు 8 ఉన్నాయి.
5 కోట్లు దాటిన ఐటీఆర్ ఫైలింగ్
న్యూఢిల్లీ, జూలై 27: దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఇప్పటి వరకు 5 కోట్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలు చేశారని ఆదాయ పన్ను శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గతేడాది దాఖలు చేసినవారికంటే ఇది 8 శాతం అధికం. ఈ శుక్రవారం ఒక్కరోజే 28 లక్షల మంది ఐటీఆర్ ఫైల్ చేశారు.
ఆభరణాల వ్యాపారంలోకి బిర్లా గ్రూపు
న్యూఢిల్లీ, జూలై 27: ఆభరణాల వ్యాపారంలోకి అడుగుపెట్టింది ఆదిత్యా బిర్లా గ్రూపు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆభరణాల మా ర్కె ట్లోకి తాజాగా అడుగుపెట్టినట్లు, ఇంద్రియా బ్రాండ్‌తో రిటైల్ అవుట్లెట్లను ప్రారంభించినట్లు బిర్లా గ్రూపు చైర్మన్ కుమార మంగళం బిర్లా ఈ సందర్భంగా తెలిపారు. తొలి విడతలో ఢిల్లీ, ఇండోర్, జైపూర్లలో స్టోర్లను ప్రారంభించినట్లు, తర్వాతి క్రమంలో మెట్రో నగరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించారు.