Alcohol addiction | సిరిసిల్ల టౌన్, జూలై 2 : ప్రతీ ఒక్కరూ మద్యపాన అనే వ్యసనం నుండి విముక్తి పొందాలని ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ పున్నంచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గణేశ నగర్ లో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మైండ్ కేర్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నేత కార్మికులకు మనోవికాస సదస్సు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యపాన వ్యసనం వల్ల కలిగే నష్టాలను కార్మికులకు వివరించారు.
మద్యపాన వ్యసనం అనేది సైకో సోమాటిక్ డిసార్డర్ వ్యాధి అని, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని తెలిపారు. మద్యపాన వ్యసనం నుండి బయట పడేందుకు డే కేర్ అండ్, కౌన్సిలింగ్ సెంటర్లో పైకాలజిస్ట్, సైక్రియాట్రిస్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మద్యపానం వ్యసనం భారీనపడిన వ్యక్తులకు ఇక్కడ కౌన్సిలింగ్‌తో పాటు అవసరమైన చికిత్స అంధిస్తున్నామని అన్నారు.
కాగ్నిటివ్ బిహేవియర్ థెరఫి ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చని తెలిపారు. కుటుంబ సభ్యులు ఎవరైన మద్యపాన వ్యసనానికి గురైనట్లు గుర్తిస్తే వెంటనే ప్రభుత్వ ఆపత్రిలోని మైండ్ కేర్ సెంటర్ కు తీసుకువచ్చి అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది రాపల్లి లత, బూర శ్రీమతి, ఉమ, కార్మికులు పాల్గొన్నారు.