Geert Wilders: డచ్ రాజకీయాల్లో సంచలనం.. గీర్త్ విల్డర్స్ పార్టీకి ఆధిక్యం
Geert Wilders: గీర్త్ విల్డర్స్ సంచలనం సృష్టించారు. అతివాది అయిన ఆయన డచ్ ఎన్నికల్లో ఆధిక్యంలో ఉన్నారు. నెదర్లాండ్స్ ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి కూటమి పార్టీలతో ఆయన చర్చలు నిర్వహించనున్నారు. తాజా ఎన్నికల్లో ఆ విల్డర్స్కు చెందిన పీవీవీ పార్టీ 37 స్థానాల్లో విజయం సాధించినట్లు తెలుస్తోంది.
ఆమ్స్టర్డ్యామ్: నెదర్లాండ్స్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదు అయ్యింది. యాంటీ ఇస్లాం నేత గీర్త్ విల్డర్స్(Geert Wilders).. తాజాగా ముగిసిన జాతీయ ఎన్నికల్లో దూసుకెళ్తున్నారు. 25 ఏళ్ల క్రితం విల్డర్స్ స్థాపించిన ఫ్రీడమ్ పార్టీ(పీవీవీ) జనరల్ ఎన్నికల్లో విజయం దిశగా వెళ్తోంది. ఆ పార్టీ 37 సీట్లను గెలుచుకోనున్నది. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో గిల్డర్స్ పార్టీ కీలకం కానున్నది. విల్డర్స్ గెలుపు డచ రాచకీయాలను కుదిపేసింది. యూరోప్ దేశాల్లోనూ ఆ పార్టీ గురించి తీవ్ర చర్చ జరగనున్నది.
డచ్ పార్లమెంట్లో 150 స్థానాలు ఉన్నాయి. దాంట్లో 76 సీట్లు టార్గెట్. అయితే ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు కూటమి పార్టీలను ఒప్పించనున్నట్లు విల్డర్స్ తెలిపారు. ఎన్నికల ప్రచారం సమయంలో అక్రమ వలసలపై ఆయన స్పష్టమైన వైఖరి వినిపించారు. బోర్డర్లను మూసివేయనున్నట్లు తెలిపారు. ఇస్లాం మత గ్రంధం ఖురాన్‌ను బ్యాన్ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
గత ఏడాది నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను విల్డర్స్ సమర్థించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

