హైదరాబాద్ : ఉత్తర తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయి, తాగునీరుకు ఇబ్బంది అవుతుంది. కరీంన గర్ ఏం తప్పు చేసింది, మంత్రుల బృందం కరీంనగర్ ఎందుకు రావడం లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రశ్నించారు. మమ్మల్ని ఎన్నుకున్న ప్రజల బాధలు చూడలేకనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయా ల్సి వచ్చిందన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. పంటల కు నీళ్లవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రుల బృందం కరీంనగర్ వస్తే మా బాధలు అర్థమవుతాయన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పై నాకు పూర్తి అవగాహన ఉంది.
మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర రోజు 9 టీఎంసీల నీళ్లు పోతున్నాయి. కన్నేపల్లి పంపులు ఆన్ చేసి అన్నారం బ్యారే జ్లో నీళ్లు ఎత్తిపోయవచ్చని సూచించారు. మిడ్ మానేర్ పరిధిలో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోతుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి రాంగ్ సలహా ఇస్తున్నారు. అన్నారం బ్యారేజ్ కూలిపోతే బీఆర్ఎస్ బాధ్యత వహిస్తుంది. దయచేసి భేషజా లకు పోకుండా కన్నేపల్లి పంపులు ఆన్ చెయ్యండి. కన్నేపల్లి దగ్గర నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాలని సూచించారు.