Gadar 2 | బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol), అమీషా పటేల్ (Amisha Patel) ప్రధాన పాత్రలో వచ్చిన ‘గదర్-ఏక్ ప్రేమ్ కథా’ (Gadar Ek Prem Katha) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2001లో వచ్చిన ఈ మూవీ సన్నీ డియోల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా కేవలం రూ.18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ.133 కోట్ల వసూళ్లు రాబట్టింది. అయితే రెండు దశాబ్దాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా గదర్-2 (Gadar 2) తెరకెక్కింది. సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటీవ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా చూడటానికి రాజస్థాన్‌లో అభిమానులు ట్రాక్టర్లో థియేటర్‌కు వెళుతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ విధంగా థియేటర్‌కు ట్రాక్టర్లలో ప్రేక్షకులు రావడం గమనార్హం. అయితే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ వీడియో చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్పందించారు.
“రాజస్థాన్ రాష్ట్రంలో జనాలు ట్రాక్టర్లు వేసుకుని గద్దర్ 2 సినిమా చూడడానికి వస్తున్నారు. ఇది నాకు చాలా ఆనందిస్తుంది. ఎందుకో చెప్పండి (మహీంద్రా ట్రాక్టర్లపై వస్తున్నారు) అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
In Rajasthan: people flocking to see #Gadar2 on Tractors. No prizes for guessing why I’m VERY pleased to see this… pic.twitter.com/RqyGX94Lu8
— anand mahindra (@anandmahindra) August 13, 2023
1971 నాటి భారత్-పాక్ యుద్ధ సమయంలోని పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటీవ్ రెస్పాన్స్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. విడుదలైన రెండు రోజుల్లోనే ఏకంగా 83 కోట్లు కలెక్ట్ చేసింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను అనిల్ శర్మ దర్శకత్వం వహించగా.. కమల్ ముఖుత్తో కలిసి అనిల్ శర్మ సంయుక్తంగా నిర్మించారు. ఉత్కర్ష్ శర్మ, స్మృతీ కౌర్, మనీష్ వాద్వా, గౌరవ్ చోప్రా తదితరులు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రానికి మిథున్, మోంటీ శర్మ సంగీతం అందించారు.