షుగర్, బీపీ రోగులకు ఉచితంగా ఔషధాలు
- వచ్చేనెల నుంచి ఎన్సీడీ కిట్ల పంపిణీ

హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): షుగర్, బీపీ, హైబీపీ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి వచ్చేనెల నుంచి నాన్ కమ్యూనబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం ఎన్హెచ్ఎంలో భాగంగా నిర్వహించిన సమీక్షలో ఈ కిట్లను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా అసాంక్రమిత వ్యాధులను గుర్తించడంలోభాగంగా పరీక్షలు నిర్వహించగా.. ఏడు లక్షల మంది షుగర్ పేషెంట్లు, 20 లక్షల మంది బీపీ పేషెంట్లు ఉన్నట్టు తేలింది. వీరందరికీ దశలవారీగా ఎన్సీడీ కిట్లను పంపిణీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. షుగర్, బీపీ నియంత్రణ మందులు అందించే ఈ కిట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించింది. ‘ఉన్నతమైన జీవనానికై ఆరోగ్యకరమైన అలవాట్లు’ అనే నినాదాన్ని కిట్లపై ప్రచురించింది.
సమతుల ఆహారం, వ్యాయామం, పొగ తాగరాదు, జంక్ ఫుడ్ తినరాదు, మద్యం సేవించరాదు, యోగా, మంచి నిద్ర వంటి ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి పేర్కొన్నది. రెండో వైపు షుగర్, బీపీ లక్షణాలతోపాటు వాటి వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించింది. కిట్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వేసుకొనే మందులు నెలకు సరిపోయే షుగర్, బీపీ మందులను ఉంచి కిట్లను రోగులకు అందించనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

