హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): జపాన్‌లో జరుగనున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సకుర సైన్స్ ఎగ్జిబిషన్‌కు రాష్ర్టానికి చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.
జీ శివాంజలి (కరీంనగర్), సీహెచ్ అక్షయ (హనుమకొండ), బీ పరూష (మహబూబ్‌నగర్), బీ వేణు (సిద్దిపేట) ఈ నెల 24 నుంచి 30 వరకు జపాన్‌లో జరిగే ప్రదర్శనలో ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు.