జగిత్యాల రూరల్, ఏప్రిల్ 23: ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీదండులా కదలిరావాలని పార్టీ శ్రేణులకు జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పిలుపునిచ్చారు. బుధవారం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం, చల్గల్ క్లస్టర్ గ్రామాల్లో మాజీమంత్రి రాజేశం గౌడ్‌తో కలిసి ముఖ్య నాయకులు, బస్ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించి, దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంతర్గాం గ్రామంలో పుష్కలమైన తాగు, సాగునీరందించిన ఘనత రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితదేనని కొనియాడారు.
పంట పొలాలు పచ్చగా ఉన్నాయంటే అందుకు కారణం వారేనని చెప్పారు. ఇల్లులేని నిరుపేదలకు 100 డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన ఘనత ఎమ్మెల్సీ కవితదేనని ప్రశంసించారు. ఈ నెల 27న గ్రామగ్రామాన గులాబీ జెండాలు ఎగురవేసి గులాబీదండులా రజతోత్సవ సభకు బయలుదేరి విజయవంతం చేయాలని కోరారు.
సమావేశంలో మండలాధ్యక్షుడు అనంతరావు, తుమ్మ గంగాధర్, పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు లక్ష్మణ్ రావు, తిరుపతి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, సాయి, షఫీ, మల్లేశ్, మురళి, శ్రీనివాస్, రాజం, మల్లయ్య, మహేశ్, పోచమల్లయ్య, రంజిత్, వెంకటేశ్, గంగారాం, గంగశేఖర్, గంగసాగర్, ముత్యం, గంగాధర్, రాజేశం, దేవన్న, రమేశ్, కిషన్, రాకేశ్, గోపాల్, వెంకన్న, గంగారెడ్డి, చామల్ పాల్గొన్నారు.