సీఎం కేసీఆర్‌కు మాజీ ప్రజాప్రతినిధుల వినతి
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు తమకూ ఇండ్ల స్థలాలు కేటాయించాలని మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు విన్నవించారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర మాజీ ప్రజాప్రతినిధుల అసోసియేషన్ నేతలు సీఎం కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి మహాత్మాగాంధీ స్వాతంత్య్రం తీసుకొస్తే.. సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విముక్తి చేశారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణను నిర్మిస్తున్నారని కొనియాడారు. అసెంబ్లీ ప్రాంగణంలో లేదా ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తమ సంఘానికి స్థలం కేటాయించాలని, జీఏడీ ద్వారా గుర్తింపు కార్డులు జారీచేయాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో అసోసియేషన్ అధ్యక్షుడు కే లింగయ్య, ఉపాధ్యక్షుడు రాజేశంగౌడ్, కోశాధికారి ఆంజనేయులు, ఇనగాల పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు.