నాగర్‌కర్నూల్, జూన్ 28 : సొంతజిల్లా పాలమూరులో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనతో ఇక్కడి ప్రజలకు, రైతులకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఏడాదిలోపు పూర్తి చేస్తామని చెప్పినా ఇప్పటికీ ఎస్టిమేషన్ కూడా వేయలేదని విమర్శించారు. ప్రాజెక్టుల ద్వారా ఈప్రాంతంలో 35 లక్షల ఎకరాలకు సాగునీరు అందేందుకు అనుకూలంగా ఉన్నా ప్రస్తుతం 7వేల ఎకరాలకు కూ డా నీరందడం లేదని, అదే నల్లగొండ జిల్లాకు మాత్రం 17లక్షల ఎకరాల సాగు సామర్థ్యానికి ఇప్పటికే 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
యథేచ్చగా డిండికి నీరు తరలుతున్నా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ వీరికి పదవులు ఎందుకని వెంటనే రాజీనామాలు చేయాలన్నారు. ఇటీవల మంత్రి జూ పల్లి కాల్వ సామర్థం తక్కువగా ఉందని చెప్ప డం నిస్సిగ్గుగా ఉందన్నారు. కేఎల్ఐ ప్రాజెక్టులో చెడిపోయిన రెండు మోటర్ల గురించి సీఎంకు తెలియజెప్పకపోవడం సిగ్గుచేటన్నా రు. మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించడం మానుకొని రెండున్నరేండ్లలో సొంత జిల్లాలో రేవంత్‌రెడ్డి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 45ఏండ్ల తన రాజకీయ జీ వితంలో ఎవరినీ విమర్శించలేదని, తన ప ని తానుచేసుకుంటూ పోయానని గుర్తు చేశారు.
కష్టకాలంలో రైతులను ఆదుకోవాలి..
ప్రస్తుత సీజన్లో వర్షాలు లేక చాలా మంది రైతులు పంటలను సాగు చేసుకొని నష్టాలపాలవుతున్నారని వారిని ఆదుకోవాలని మాజీ మంత్రి నాగం డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పత్తి విత్తనాలు నాటి నష్టపోయిన రైతులను గుర్తించాలన్నారు. ఎరువులతోపాటు విత్తనాలు కూడా అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారని, వాటన్నింటికీ అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల స మావేశంలో డాక్టర్ నాగం శశిధర్‌రెడ్డి, నా యకులు అర్థం రవి, బాలగౌడ్, లక్ష్మయ్య, అర్జునయ్య, వెంకటస్వామి, భీమయ్య, సత్యం తదితరులు పాల్గొన్నారు.