ఎమోషనల్‌గా గుర్తుకొస్తున్నాయి
విరాజ్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. వినోద్ గాలి దర్శకుడు. శరత్చంద్ర నాయుడు నిర్మాత. జూలై 3 నుంచి ఈటీవీ విన్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్‌కి మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు.
విరాజ్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. వినోద్ గాలి దర్శకుడు. శరత్చంద్ర నాయుడు నిర్మాత. జూలై 3 నుంచి ఈటీవీ విన్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్‌కి మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఈ వేడుకకు హీరో సత్యదేవ్, అగ్ర దర్శకులు బోయపాటి శ్రీను, కరుణాకరన్, నిర్మాతలు మైత్రీ రవి, బన్నీవాసు, ఎస్కేఎన్, ధీరజ్, వంశీ నందిపాటి అతిథులుగా విచ్చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు.
‘ఈ సిరీస్‌కి కథే ప్రధానబలం. ఇందులో నా పాత్ర గతాన్ని మర్చిపోతుంది. ఆద్యంతం భావోద్వేగపూరితంగా దర్శకుడు ఈ సిరీస్‌ని మలిచారు. షూటింగ్ టైమ్‌లో నాకు గత జ్ఞాపకాలు చాలా గుర్తొచ్చాయి. చూసే ప్రేక్షకులకు కూడా అదే అనుభూతి కలుగుతుంది. ఎమోషన్స్‌తోపాటు ఫన్నీ సీక్వెన్స్, ఎంటర్టైనింగ్ మూమెంట్స్ కూడా ఇందులో ఉంటాయి’ అని హీరో విరాజ్ అశ్విన్ చెప్పారు. వెబ్‌సిరీస్‌లకు అవార్డు ఇస్తే, ఈ సిరీస్‌కు తప్పకుండా అవార్డ్ వస్తుందని నిర్మాత శరత్చంద్రనాయుడు నమ్మకంగా చెప్పారు. ఇంకా ఈటీవీ విన్ ప్రతినిథులు సాయికృష్ణ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

