న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) శత వార్షికోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రత్యేక పోస్టేజ్ స్టాంపు, స్మారక నాణేలను విడుదల చేశారు. ఈ నాణెంపై ఒకవైపు అభయ ముద్రతో కూడిన భారత మాత చిత్రం ఉంది. ఆమె ముందు స్వయం సేవకులు భక్తి, అంకితభావాలతో విధేయంగా నిల్చున్నట్లు ఉంది. మరోవైపు భారత జాతీయ చిహ్నం నాలుగు సింహాల గుర్తు ఉంది. ఆరెస్సెస్ ఆదర్శ వాక్యం “రాష్ర్టే స్వాహా, ఇదం రాష్ర్టాయ, ఇదం న మమ” (అంతా దేశానికే అంకితం, ప్రతీదీ దేశానిదే, నాదేమీ లేదు)ను కూడా ముద్రించారు.