ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్..నోకియా బ్రాండ్ పేరుతో బ్లూటూత్ హెడ్‌సెట్స్, ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్ఫోన్ల(TWS)ను భారత్‌లో ఆవిష్కరించింది. నోకియా బ్లూటూత్ నెక్‌బ్యాండ్ T2000 ధర రూ.1,999 కాగా, నోకియా ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్ T3110 ధర రూ.3,999గా నిర్ణయించారు. రెండింటిలోనూ మైక్రోఫోన్ ఉంది. ఈ ప్రొడక్టులను ఏప్రిల్ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. బ్లూటూత్ హెడ్సెట్లో క్వాల్కమ్ QCC3034 బ్లూటూత్ ఆడియో చిప్సెట్, 11mm డ్రైవర్‌తో వస్తుంది.