Flipkart | ఫ్లిప్‌కార్ట్ సీఈవో రాజీనామా
Flipkart | వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి(Kalyan Krishnamurthy) తన పదవికి రాజీనామా చేశారు.
Flipkart | వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి(Kalyan Krishnamurthy) తన పదవికి రాజీనామా చేశారు. భారతదేశపు అత్యంత విజయవంతమైన స్వదేశీ ఇ-కామర్స్ కంపెనీలలో ఒకటైన ఈ సంస్థకు దశాబ్దకాలంగా సారథ్యం వహించిన ఆయన ప్రస్థానం ముసిందని బుధవారం సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆయన డిసెంబర్ 4, 2026న తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. దీనితో ఫ్లిప్‌కార్ట్‌లో ఆయన 11 ఏళ్లకు పైగా సాగిన సుదీర్ఘ ప్రస్థానానికి తెరపడనుంది. కొత్త సీఈఓను నియమించే వరకు, చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO) బాలాజీ త్యాగరాజన్ ఫ్లిప్‌కార్ట్ బోర్డు సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు.
2018లో ఫ్లిప్‌కార్ట్‌కు సీఈవో అయిన కల్యాణ్ కృష్ణమూర్తి ప్ప్రత్యర్థి సంస్థలైన మీషో, అమెజాన్ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికి ఫ్లిప్‌కార్ట్ స్థిరంగా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. మరీ ముఖ్యంగా జెన్‌జీ కస్టమర్లను ఆకట్టుకోవడంలో కల్యాణ్ కృష్ణమూర్తి విశేషంగా కృషి చేశారని చెప్తారు. అలాగే ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టి జెప్టో, బ్లింకిట్ కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ను తీసుకురావడంపై దృష్టి పెట్టారు.
కగా, కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామాకు గల కచ్చితమైన కారణాలను సంస్థ వెల్లడించలేదు. అయితే, ఫ్లిప్‌కార్ట్ ఐపీఓ (IPO) జాప్యం, ఇటీవలి కాలంలో పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నిష్క్రమణ, ఉద్యోగుల ఈఎస్వోపీ విధానాలపై నెలకొన్న అనిశ్చితి వంటి పరిస్థితుల నడుమ ఈ కీలక మార్పు చోటుచేసుకుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flipkart | ఫ్లిప్‌కార్ట్ సీఈవో రాజీనామా
‘ప్రజలు గ్రామాభివృద్ధికి సహకరించాలి’
‘పశువుల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ వహించాలి’
Sampath Nandi | కథ ప్రకారమే ఆ సన్నివేశాలు ఉంటాయి.. ‘భోగి’ సినిమాలో హింసపై దర్శకుడు సంపత్ నంది క్లారిటీ!
Professor Teja Sri | క్షీణించిన ప్రొఫెసర్ తేజ శ్రీ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

