హైదరాబాద్ : నగర శివారు ప్రాంతాల్లో భారీగా పొగమంచు పేరుకుపోయింది. శంషాబాద్ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో విమానరాకపోకలకు అంతరాయం కలిగింది. రాజీవ్‌గాంధీ విమానాశ్రయానికి వచ్చిన పలు విమానాలను దారి మళ్లించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ముంబయి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తిరిగి చెన్నైకి మళ్లించారు.