సికింద్రాబాద్, డిసెంబర్ 30: ఒంటరి ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని.. పిక్‌పాకెటింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, చిలకలగూడ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి కారు, ఆరు సెల్ఫోన్లు, రూ. 3వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు నార్త్‌జోన్ డీసీపీ చందన దీప్తి గురువారం వెల్లడించారు. ఫారూఖ్ ఖాన్ (29) ,మహహ్మద్ ఖలీద్ (23), సయ్యద్ ఖాజా(22), సల్మాన్ షరీఫ్(22), షేక్ ఇస్మాయిల్(19)లు స్నేహితులు. ముఠాగా ఏర్పడి.. అద్దెకు కార్లు.. తీసుకొని..అత్తాపూర్, మెహిదీపట్నం, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో ఒంటరి ప్రయాణికులకు ఎక్కించుకొని.. వారి సెల్ఫోన్లు, పర్సులను దొంగిలిస్తున్నారు. ఈనెల 21న చిక్కడపల్లిలో నివాసముండే అడ్వకేట్ కస్తూరి సంజీవ్‌రావు సెల్‌ఫోన్స్, పర్సును ఇలాగే కాజేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి..నిందితులను అదుపులోకి తీసుకున్నారు.