International Physics Olympiad | ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో భారతీయుల సత్తా
International Physics Olympiad | అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ (IPhO- International Physics Olympiad) ఐదుగురు భారతీయ విద్యార్థులు సత్తా చాటారు. వీరు అగ్రస్థానంలో నిలిచి ఐదు బంగారు పతకాలు సాధించారు
International Physics Olympiad | అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ (IPhO- International Physics Olympiad) ఐదుగురు భారతీయ విద్యార్థులు సత్తా చాటారు. వీరు అగ్రస్థానంలో నిలిచి ఐదు బంగారు పతకాలు సాధించారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పాఠశాల స్థాయి భౌతికశాస్త్ర (Physics) పోటీల్లో ఈ ఒలింయాడ్ ఒకటి. దీనిలో భారత్ నుంచి పుణెకు చెందిన కనిష్క్ జైన్, ఇండోర్‌కు చెందిన రిద్దేశ్ అనంత్ బెందాలె, న్యూ ఢిల్లీకి చెందిన రిషిత్ గార్గ్, ముంబైకు చెందిన శ్రేష్ట్ సురైయా, అహ్మదాబాద్‌కు చెందిన స్వరిత్ జోషి పాల్గొన్నారు.
దీనిలో భారత్ చైనా, కజకిస్తాన్, రష్యా, దక్షిణ కొరియా, తైవాన్లతో కలిసి అగ్రస్థానాన్ని పంచుకుని స్వర్ణ పతకాలు గెలుచుకుంది.
బంగారు పతకాలు గెలుచుకున్న ఐదుగురిలో నలుగురు కనిష్క్ జైన్, రిద్దేశ్ బెందాలె, రిషిత్ గార్గ్, స్వరిత్ జోషి కోటా (రాజస్థాన్)లోని అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు.
వీరిని భారత ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో అభినందించారు. వారి ఈ ఘనత మన యువశక్తి అపరిమితమైన సామర్థ్యానికి, విజ్ఞానశాస్త్రం, పరిశోధనల పట్ల వారికున్న అభిరుచికి మరో నిదర్శనం అని కితాబిచ్చారు.
56వ ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ కొలంబియాలోని బుకరమంగలో జూలై 4 నుంచి 12 వరకు నిర్వహించారు. ఈ పోటీలో 87 దేశాల నుంచి 381 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

