Ramayana | ఇటీవలే తండేల్తో సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్వరలో సీత పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. సాయిపల్లవి, బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ కలిసి నటిస్తున్న చిత్రం ‘రామాయణ’. ఈ చిత్రాన్ని నితేశ్ తివారీ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 2026 దీపావళికి తొలిభాగం, 2027 దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అయితే తాజాగా ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ వైరల్‌గా మారింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ గింప్స్‌ను ముంబైలోని వరల్డ్ జియో సెంటర్లో జరిగే ప్రపంచ ఆడియో విజువల్ & ఎంటర్టైన్మెంట్ సమ్మిట్(WAVES)లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. శ్రీరామనవమి పండుగ రోజున విడుదల చేద్దామనుకున్న అనుకోని కారణాల వలన వాయిదా పడింది. దీంతో తాజాగా వేవ్స్ సమ్మిట్‌లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
ఏ.ఆర్.రెహమాన్‌తో పాటు హాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మెర్ ఈ చిత్రాన్ని సంగీతాన్నందించబోతున్నారు. ఈ సినిమాలో రావణ పాత్రలో నటిస్తున్నట్లు కన్నడ అగ్ర నటుడు యష్ ఇటీవలే ప్రకటించారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్, కైకేయి పాత్రలో లారా దత్తా నటించనున్నారని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయిలో వేసిన భారీ సెట్లో జరుగుతున్నది.