ములకలపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కమలాపురం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో కరెంటు షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలను చూసి భయాందోళనకు గురైన విద్యార్థులు భయంతో పాఠశాల ఆవరణలోని చెట్టు కిందకు పరుగులు తీశారు.
ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదుగానీ.. ఆస్తినష్టం సంభవించింది. మంటల్లో మూడు వందల పరుపులు, క్రీడా సామాగ్రి కాలిపోయాయి. ఎస్సై రాజశేఖర్, స్థానికులు మంటలు ఆర్పుతున్నారు.