అడిలైడ్: టీ20 వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 52 రన్స్ చేసింది. ఫిన్ అలెన్ దూకుడుగా ఆడి 18 బంతుల్లో 32 రన్స్ చేసి ఔటయ్యాడు. అలెన్ ఇన్నింగ్స్‌లో అయిదు ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. కివీస్ ఓపెనర్లు అలెన్, కాన్వేలు ఆరంభంలో ఆచితూచి ఆడారు. ఆ తర్వాత అలెన్ భారీ షాట్లకు ప్రయత్నించాడు.