హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) రాష్ట్రంలో స్కిల్ సెంటర్ను నెలకొల్పబోతున్నది. హైదరాబాద్కు సమీపంలోని భువనగిరి వద్ద పది ఎకరాల స్థలంలో ఈ స్కిల్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ కొత్త చైర్పర్సన్ ప్రతిభా కుందా తెలిపారు.
తద్వారా రెండు వేల మంది మహిళలు, విద్యార్థినులకు ప్రతిభలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఎఫ్ఎల్వో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా వెయ్యి మంది యువతకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను ఎఫ్ఎల్వో నూతన కార్యవర్గం గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.