క్రెడిట్ కార్డ్ కావాలనుకునేవారికి తొలుత ఆందోళన కల్గించేది వార్షిక ఫీజే. వాడినా, వాడకపోయినా ఏటా నిర్దేశిత ఫీజును క్రెడిట్ కార్డ్ కంపెనీకి చెల్లించాల్సిందే. అధిక ఫీజులున్నా అంతకుమించి రివార్డుల్ని పొందే ప్రయోజనం ఉంటే ఓకే. తక్కువ ఖర్చుచేసే అలవాటు ఉన్నవారికి జీరో వార్షిక ఫీజుతో కూడిన కార్డులే మేలు. అలా వార్షిక రుసుం లేకుండా, ప్రయోజనాల్ని అందించే ఐదు కార్డుల్ని ఆన్లైన్ సంస్థ పైసాబజార్ ఎంపిక చేసింది. ఆ కార్డులివే…
అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్
అమెజాన్ ప్రైమ్ మెంబర్ల కొనుగోళ్లపై 5%, నాన్-అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు 3% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. షాపింగ్, డైనింగ్, ఇన్సూరెన్స్, ట్రావెల్ వ్యయాలపై 1% క్యాష్‌బ్యాక్, ఇంధన సర్‌ఛార్జ్‌పై 1% మినహాయింపుంటుంది.
ఐసీఐసీఐ ప్లాటినం చిప్ కార్డ్ ఇంధనం మినహా రిటైల్ కొనుగోళ్లపై రూ.100కు రెండు పేబ్యాక్ పాయింట్లు లభిస్తాయి.
వినియోగ వస్తువులు, బీమా ప్రీమియం చెల్లింపులపై రూ.100కు ఒక పేబ్యాక్ పాయింట్ వస్తుంది.
ఇంధన సర్‌ఛార్జ్‌పై 1% మినహాయింపు, పలు రెస్టారెంట్లలో 15% డిస్కౌంట్ పొందవచ్చు.
యాక్సిస్ ఇన్‌స్టా ఈజీ
ఫిక్స్డ్ డిపాజిట్లపై యాక్సిస్ బ్యాంక్ ఈ కార్డ్‌ను జారీ చేస్తుంది. డిపాజిట్ విలువలో 80% వరకూ కార్డ్‌పై రుణ పరిమితి ఉంటుంది. 100% విత్‌డ్రా చేసుకోవచ్చు. భాగస్వామ్య రెస్టారెంట్లలో 15% డిస్కౌంట్, ఇంధన సర్‌ఛార్జ్‌పై 1% మినహాయింపుంటుంది.
హెచ్ఎస్బీసీ వీసా ప్లాటినం
ఈ కార్డ్‌తో ఇంధన సర్‌ఛార్జ్‌పై ఏడాదిలో రూ.3,000 వరకూ ఆదా చేసుకోవచ్చు. టాటా క్లిక్‌లో షాపింగ్ చేస్తే 15% డిస్కౌం ట్, బుక్‌మైషోలో ఆఫర్లు, విమానాశ్రయ లాంజ్ల్లో ఏడాదికి మూడుసార్లు కాంప్లిమెంటరీ లాంజ్ సదుపాయాలుంటాయి.
కొటక్ గోల్డ్ ఫార్చ్యూన్
వ్యాపారులకే కొటక్ బ్యాంక్ ఈ కార్డ్‌ను ఇస్తున్నది. ఏడాదికి రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తే ఉచిత పీవీఆర్ మూవీ టికెట్లు, ఇంధన సర్ఛార్జ్ రద్దు తదితర ప్రయోజనాలు లభిస్తాయి.