Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Accident | కీసర మండలం యాద్గారిపల్లి గ్రామానికి చెందిన పుట్ట శ్రీరాములు తన కొడుకు పెళ్లి పత్రికలు పంచేందుకు బైకుపై మరో వ్యక్తితో కలిసి బయలు దేరాడు. అయితే ఈ క్రమంలో ఆ బైకును పారిశ్రామిక వ్యర్థాలను తరలించే లారీ ఢీకొట్టింది.
Accident | కొన్ని రోజుల్లో పెళ్లి బాజాలు మోగనున్న ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తన కొడుకు పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారు శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
కీసర మండలం యాద్గారిపల్లి గ్రామానికి చెందిన పుట్ట శ్రీరాములు (48) తన కొడుకు పెళ్లి పత్రికలు పంచేందుకు పుట్ట చిత్తయ్య (65)తో కలిసి బైకుపై బయలు దేరాడు. అయితే ఈ క్రమంలో మూడు చింతలపల్లిలో నాగిశెట్టిపల్లి కోళ్ల ఫారాల సమీపంలో వీరిద్దరూ ప్రయాణిస్తున్న బైకును పారిశ్రామిక వ్యర్థాలను తరలించే లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీరాములు, చిత్తయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శ్రీరాములు మృతితో పెళ్లి సంబురాలు చేసుకోవాల్సిన ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. శ్రీరాములు, పుట్ట చిత్తయ్య కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కొడుకు పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి తండ్రి మృతి
హైదరాబాద్ శివారు శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడు చింతలపల్లిలో నాగిశెట్టిపల్లి కోళ్ల ఫారాల సమీపంలో బైకును ఢీకొన్న పారిశ్రామిక వ్యర్థాలను తరలించే లారీ
ఈ ప్రమాదంలో కీసర మండలం యాద్గారిపల్లి గ్రామానికి చెందిన పుట్ట శ్రీరాములు (48), పుట్ట చిత్తయ్య (65) అనే ఇద్దరు వ్యక్తులు మృతి
శ్రీరాములు తన కొడుకు పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు గుర్తింపు
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు
Bank collapse In Paraguay | బ్యాంకు పతనంతో నిరసనలు.. పరాగ్వే అధ్యక్షుడు గృహ నిర్బంధం
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

