సంగెం, నవంబర్ 23: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి సూచించారు. తిమ్మాపురంలో సంగెం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎంపీపీ, జడ్పీటీసీ ప్రారంభించి మాట్లాడారు. నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని అన్నదాతలకు సూచించారు. కార్యక్రమంలో సంగెం సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ నరహరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సారంగపాణి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, సర్పంచ్‌లు గన్ను శారద-సంపత్, ఛత్రూనాయక్, ఉపసర్పంచ్ సారంగం, మాజీ సర్పంచ్ రాంరెడ్డి, ఎంపీటీసీలు నర్సింహస్వామి, మాజీ ఎంపీపీ వీరాచారి, పీఏసీఎస్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
అందుబాటులో కొనుగోలు కేంద్రాలు
రైతులకు అందుబాటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, నిబంధనల మేరకు ధాన్యం తెచ్చి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని గురిజాల పీఏసీఎస్ చైర్మన్ ఆకుల రమేశ్‌గౌడ్ కోరారు. గ్రామంలోని పీఏసీఎస్ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఈవో సింధూకిరణ్మయి, వీఆర్వో లింగయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మేరుగు యాకయ్య, డైరెక్టర్లు గడ్డం నర్సింగం, ఎడ్ల రవీందర్, పర్శ నర్సింహస్వామి, రాగిరి కరుణాకర్, సీఈవో కోటి, సారంగం, సంపత్ పాల్గొన్నారు. దుగ్గొండి మండలం మందపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో మందపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసిల్దార్ సంపత్‌కుమార్ తనిఖీ చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను అన్నదాతలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గుడిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది వెంకటేశ్వర్లు, నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.