Director Ravi Babu | వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రవిబాబు, సినిమా టికెట్ల ధరలు, ఫ్యాన్స్ షోల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం రేజర్ (Razor). ఈ చిత్రం మే 08న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు రవిబాబు. అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ డే ఫస్ట్ షోకి టాలీవుడ్లో టికెట్ రేట్లు పెంచడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సినిమా విడుదలైన మొదటి రోజు థియేటర్లకు వచ్చే ఫ్యాన్స్ దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేయడం చాలా తప్పని తెలిపిన రవిబాబు మొదటి రోజు అభిమానులకు సినిమాను ఉచితంగా చూపించాలని అన్నారు. అభిమాన హీరో సినిమాను భుజాన వేసుకుని మోసేది వారే. అటువంటి వారిపై అదనపు భారం వేయడం సరికాదు అంటూ రవిబాబు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచడం వల్ల సామాన్య అభిమానులు ఇబ్బంది పడుతున్నారని, దీనిని మార్చాలని ఆయన సూచించారు.