పవన్ కళ్యాణ్ అభిమానులు గత మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మార్నింగ్ బెనిఫిట్ షోతో వకీల్ చిత్రం ప్రదర్శితం కాగా, ఈ సినిమా రెండు వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలవుతుంది. మూడు రోజుల వరకు అడ్వాన్స్ బుక్కింగ్స్ పూర్తి కావడంతో ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర టిక్కెట్స్ కోసం నానా తంటాలు పడుతున్నారు.
అభిమాన నటుడి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫ్యాన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్స్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ వెండితెరపై చూసేందుకు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు .కరోనాని సైతం లెక్క చేయకుండా నానా హంగామా చేస్తున్నారు. థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే వకీల్ సాబ్‌కు పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సినిమా టిక్కెట్స్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.