Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Fake Potatoes | ఈ మధ్య కాలంలో కల్తీల బెడద బాగా పెరిగిపోతున్నది. దాంతో వినియోగదారులు ఏది కల్తీనో, ఏది స్వచ్ఛమైనదో తేల్చుకోలేక తీవ్ర అయోమయానికి లోనవుతున్నారు. వ్యాపారులు కస్టమర్ల ఆరోగ్యం కంటే వారు వెనకేసుకునే కాసులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉప్పు కల్తీ, పప్పు కల్తీ, వంటనూనె కల్తీ, పాలు కల్తీ, బియ్యం కల్తీ, మాంసం కల్తీ, ఆఖరికి తాగే మంచినీళ్లు కూడా కల్తీ. ఇలా అన్నీ కల్తీమయం అవుతున్నాయి.
Fake Potatoes : ఈ మధ్య కాలంలో కల్తీల బెడద బాగా పెరిగిపోతున్నది. దాంతో వినియోగదారులు ఏది కల్తీనో, ఏది స్వచ్ఛమైనదో తేల్చుకోలేక తీవ్ర అయోమయానికి లోనవుతున్నారు. వ్యాపారులు కస్టమర్ల ఆరోగ్యం కంటే వారు వెనకేసుకునే కాసులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉప్పు కల్తీ, పప్పు కల్తీ, వంటనూనె కల్తీ, పాలు కల్తీ, బియ్యం కల్తీ, మాంసం కల్తీ, ఆఖరికి తాగే మంచినీళ్లు కూడా కల్తీ. ఇలా అన్నీ కల్తీమయం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో కల్తీ వెలుగులోకి వచ్చింది. కొత్తగా ఆలుగడ్డలను కూడా కల్తీ చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.
ఉత్తరప్రదేశ్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడింగ్‌లో పెద్ద సంఖ్యలో కల్తీ ఆలుగడ్డలు బయటపడ్డాయి. వాడిపోయిన బంగాళాదుంపలు నిగనిగలాడటం కోసం వ్యాపారులు వాటికి కెమికల్స్ పూస్తున్నారు. లాభాల కోసం కక్కుర్తితో వినియోగదారుల ఆరోగ్యాలను ఫణంగా పెడుతున్నారు. కాబట్టి కస్టమర్లు ఆలుగడ్డలు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవి కల్తీవో, ఏవీ మంచివో పరిశీలించి కొనుగోలు చేయాలి. అదృష్టవశాత్తు కల్తీ ఆలుగడ్డలను గుర్తించడానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి.
వాసన : స్వచ్ఛమైన ఆలుగడ్డలు సహజమైన మట్టి వాసన కలిగి ఉంటాయి. కల్తీ ఆలుగడ్డలు అందుకు విరుద్ధంగా కృత్రిమమైన రసాయనాల వాసన కలిగి ఉంటాయి.
రంగు : ఆలుగడ్డను కత్తిరించి చూడాలి. కల్తీ ఆలుగడ్డ అయితే లోపల, బయట వేర్వేరు రంగులో కనిపిస్తుంది. స్వచ్ఛమైన ఆలుగడ్డ రంగు లోపల, బయట ఒకేలా ఉంటుంది.
నీటి పరీక్ష : ఆలుగడ్డలను నీటిలో వేయడం ద్వారా కూడా ఏది కల్తీనో, ఏది స్వచ్ఛమైనదో గుర్తించవచ్చు. కల్తీ ఆలుగడ్డలు రసాయనాల కారణంగా నీళ్లలో తేలుతాయి. కానీ స్వచ్ఛమైన తాజా ఆలుగడ్డలు నీళ్లలో మునిగిపోతాయి.
మట్టి : కల్తీ ఆలుగడ్డలపై ఉన్న పూతమట్టి నీళ్లలో వేయగానే సులువుగా కరిగిపోతోంది. కానీ స్వచ్ఛమైన ఆలుగడ్డలపై ఉండే సహజమైన మట్టి అంత సులువుగా పోదు. అదిపోవాలంటే గట్టిగా రుద్ది కడగాల్సి వస్తుంది.
తొక్క : ఆలుగడ్డలను కడిగేటప్పుడు స్వచ్ఛమైన ఆలుగడ్డలపై ఉండే పొట్టు సులువుగా ఊడిపోతుంది. కానీ కల్తీ ఆలుగడ్డలపై ఉండే పొట్టు వాడిపోవడంవల్ల అంత సులువుగా ఊడదు.
గమనిక : పైన పేర్కొన్న మెలుకువలను పాటించడం ద్వారా మనం మార్కెట్లో దొరికే ఆలుగడ్డల్లో నకిలీవి ఏవో, స్వచ్ఛమైనవి ఏవో గుర్తించవచ్చు.
నకిలీ ఆలుగడ్డలతో నష్టాలు
నకిలీ ఆలుగడ్డలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. రసాయనాలు, కృత్రిమ రంగులు కలిపిన ఆ ఆలుగడ్డలు తినడంవల్ల కాలేయం, మూత్రపిండాలు లాంటి సున్నితమైన అవయవాలు దెబ్బతింటాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఆకలిని కోల్పోవడం లాంటి జీర్ణ సంబంధ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి అలుగడ్డలే కాదు, ఏ ఆహార ఉత్పత్తులనైనా గుడ్డిగా కాకుండా కొంచెం పరిశీలించి కొనుగోలు చేయడం ఉత్తమం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

