అతి వ్యాయామం.. ఆరోగ్యానికి హానికరం!
చాలామంది సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ బాడీ కోసం పరితపిస్తుంటారు. దీనికోసం గంటల తరబడి జిమ్‌లలో కసరత్తులు చేస్తుంటారు. ఇదంతా బాగానే ఉంది. కానీ అతి వ్యాయామం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు. అదేందో తెలుసుకుందామా..
ఇన్ఫోగ్రాఫిక్
జిమ్ జోష్.. ఆరోగ్యం హుష్!
బాడీ బిల్డింగ్ అంటే కొందరు విపరీతమైన ఆసక్తి చూపుతారు. సిక్స్ ప్యాక్, జీరో సైజ్ కోసం జిమ్‌లో గంటలు గంటలు గడుపుతుంటారు. ఈ క్రమంలో చిన్నచిన్న అనారోగ్య సమస్యలు ఎదురైనా.. అంతగా పట్టించుకోరు. శరీర సౌష్టవంపై ఉన్న శ్రద్ధతో.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఓవర్ ట్రైనింగ్ వల్ల ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు, దీర్ఘకాలిక అనారోగ్యాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని గుర్తించి ముందే మేల్కొనకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
జిమ్‌లో ఎక్కువగా గడిపేవారు తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటే.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే! 90 నిమిషాల కంటే ఎక్కువ సమయంపాటు చేసే తీవ్రమైన వ్యాయామం.. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ‘ఇమ్యునాలజీ అండ్ సెల్ బయాలజీ’లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. అతిగా వ్యాయామం చేయడం అనేది న్యూట్రోఫిల్ పని తీరును, ఇమ్యునోగ్లోబిన్ స్థాయులను అణిచివేస్తుంది.
జిమ్‌లో గాయాలవ్వడం కామన్! కానీ, ఆ గాయాలు పదేపదే తిరగబెడుతుంటే.. వాటి నుంచి కోలుకోవడానికి మీ శరీరానికి తగినంత సమయం దొరకడం లేదని అర్థం. ఎక్కువగా జిమ్ చేయడం, తగినంత విశ్రాంతి లేకపోవడమే జిమ్-సంబంధిత కండరాల గాయాలకు ప్రాథమిక కారణాలని ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ డయాగ్నోస్టిక్ రీసెర్చ్’ తేల్చింది. అందుకే, నొప్పిని భరించి వ్యాయామం చేయడం.. ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇవ్వదని గుర్తించాలి.

Gym
ఎక్కువగా వ్యాయామం చేసే కొందరిలో.. మూత్రం ముదురు గోధుమ రంగు, టీ రంగులోకి మారుతుంది. ఇది ‘రాబ్డోమియోలైసిస్’ అనే పరిస్థితికి సంకేతం. జిమ్‌లో అతిగా వర్కవుట్స్ చేసినప్పుడు కండరాల నుంచి విషపూరిత ప్రొటీన్లు రక్త ప్రవాహంలోకి విడుదలవుతాయి. 2024లో ‘అపుంట్స్ స్పోర్ట్స్ మెడిసిన్’లో ప్రచురితమైన ఒక పరిశోధన దీనిని గుర్తించింది. ఈ సమస్యకు చికిత్స చేయకపోతే కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది.
తరచుగా మూడ్ మారడం కూడా వ్యాయామ సంబంధిత సమస్యే! ఓవర్ ట్రైనింగ్ వల్ల కార్టిసాల్ స్థాయులు పెరుగుతాయి. హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది నేరుగా మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అలసట, నిద్రలేమితోపాటు మూడ్ మారడాన్ని ఓవర్ట్రైనింగ్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలుగా ‘ఇమ్యునాలజీ అండ్ సెల్ బయాలజీ’ పేర్కొన్నది. జిమ్ మిమ్మల్ని మరింత ఆందోళనకు గురిచేస్తుంటే.. మీ శరీరం పూర్తిగా శక్తిని కోల్పోతున్నదని అర్థం.
భారీ వ్యాయామం తర్వాత విపరీతంగా అలసిపోయినా రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోయినా క్లాసిక్ ఓవర్ ట్రైనింగ్‌కు సంకేతమే. ‘స్పోర్ట్స్ సైకియాట్రీ’లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఓవర్ ట్రైనింగ్ అనేది నేరుగా నిద్ర పరిమాణాన్ని, నాణ్యతను దెబ్బతీస్తుంది. వ్యాయామ తీవ్రతను తగ్గించడం వల్ల నిద్రలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది. జిమ్‌కు వెళ్లని రోజుల్లో మీకు మంచి నిద్ర పడితే.. జిమ్‌లో చేసే వ్యాయామమే నిద్రలేమికి ప్రధాన కారణమని గుర్తించాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

