గురుకుల క్లాత్టెండర్లలో కక్కుర్తి!
బంకర్బెడ్లలో రూ.100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ రేవంత్ సర్కార్.. గురుకుల క్లాత్టెండర్ల కేటాయింపులోనూ అక్రమాలకు తెరలేపిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గురుకుల విద్యార్థులకిచ్చే కార్పెట్ల కాంట్రాక్టును గుజరాత్‌కు చెందిన మఫత్‌లాల్ కంపెనీకి కట్టబెట్టి..
-
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపాటు
-
అక్రమాలకు తెరలేపిన రేవంత్ ప్రభుత్వం
-
నేతన్నల పొట్టగొట్టి.. మఫత్లాల్కు కట్టబెట్టి
-
నిరుపేద విద్యార్థులతో సర్కార్ చెలగాటం
-
హైకోర్టు తీర్పును తుంగలో తొక్కిన వైనం
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తేతెలంగాణ): బంకర్బెడ్లలో రూ.100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ రేవంత్ సర్కార్.. గురుకుల క్లాత్టెండర్ల కేటాయింపులోనూ అక్రమాలకు తెరలేపిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గురుకుల విద్యార్థులకిచ్చే కార్పెట్ల కాంట్రాక్టును గుజరాత్‌కు చెందిన మఫత్‌లాల్ కంపెనీకి కట్టబెట్టి.. తెలంగాణ చేనేత కార్మికుల పొట్టలుగొడుతున్నదని ధ్వజమెత్తారు. మఫత్‌లాల్ కోసం హైకోర్టు తీర్పును సైతం తుంగలో తొక్కారని నిప్పులుచెరిగారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, పార్టీ నేత రవినాయక్‌తో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గురుకుల పిల్లలకు అందించిన మఫత్‌లాల్ కంపెనీ కార్పెట్లను, తెలంగాణ నేత కార్మికులు తయారు చేసిన దుప్పట్లను చూపుతూ సర్కార్ వైఖరిని ఎండగట్టారు. గురుకుల విద్యార్థులకు కేవలం రూ.150 విలువ చేసే రీసైకిల్డ్ బట్టలను రూ.400కు అందిస్తూ గుజరాత్ బాబులకు ప్రజాధనాన్ని సర్కార్ దోచిపెడుతున్నదని ఆరోపించారు. రెక్కలు ముక్కలు చేసుకొని మగ్గంపై తయారు చేసే నాణ్యమైన బట్టలను ఎందుకు విద్యార్థులకు ఇవ్వడంలేదు? అని ప్రస్నిచరారు
మీ మనమడికి సరిపోతాయా?
స్పీకర్ వేసుకొనే సూట్లను పేద విద్యార్థులకు అందజేస్తామని అసెంబ్లీలో ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ‘పేద పిల్లలకు అందించిన నాసిరకం దుప్పటి మీ మనమడు కప్పుకుంటాడా?’ అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. మీరు కుట్టించుకుంటే టైలర్ బిల్లును తానే భరిస్తానని పేర్కొన్నారు. రేవంత్రెడ్డికేమో ఇంద్ర భవనాలు, పట్టు తివాచీలు కావాలి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలకు కనీసం కాటన్ బెడ్షీట్లు కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు.
- సెంట్రలైజ్డ్ టెండర్లతో నేతన్నలకు అన్యాయం
హాస్టళ్లు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకొనే పేద పిల్లలకు ఇచ్చే సరుకులు, వస్తు సామగ్రి, బట్టల కేటాయింపులో సెంట్రలైజ్డ్ టెండర్ల విధానం తెచ్చి తెలంగాణ చిరు కాంట్రాక్టర్లు, నేతన్నలకు తీరని అన్యాయం చేస్తున్నారని దాసోజు దుయ్యబట్టారు. టెస్కో ద్వారా చేనేత కార్మికులకు కేటాయించాల్సిన టెండర్లలో కోతపెట్టి, సగం వాటాను గుజరాత్ కంపెనీలకు కట్టబెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. హైకోర్టు తీర్పు ప్రకారం తక్షణమే రాబోయే క్లాత్ టెండర్లను టెస్కో ద్వారానే కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని, గురుకుల విద్యార్థులకు నాణ్యమైన చేనేత కార్పెట్లు, బెడ్ షీట్లను మాత్రమే అందించాలని, సెంట్రలైజ్డ్ పీఎంయూ ప్రొక్యూర్మెంట్ పేరుతో జరుగుతున్న వేల కోట్ల రూపాయల కుంభకోణంపై సమగ్ర విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు సీఎం రేవంత్‌రెడ్డి తొత్తులుగా మారి బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

